తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు - హంస వాహనంపై విహరించిన మలయప్పస్వామి - Tirumala Hamsavahana Seva - TIRUMALA HAMSAVAHANA SEVA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 10:40 PM IST

Srivari Hamsavahana Seva Grandly Organized in Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామివారు హంస వాహనంపై మాడవీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి  శ్రీమలయప్పస్వామివారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్యాలరీలోని భక్తులు స్వామివారిని చూసి పరవశానికి లోనయ్యారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. 

అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా అహంభావాన్ని తొలగించి శరణాగతి కలిగిస్తాడని భక్తుల విశ్వాసం. కాగా ఈ రోజు ఉదయంస్వామివారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో ఆయన భక్తులకు అభయ ప్రదానం చేశారు. మాఢవీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్న వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.