Jani Master National Award : ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీమాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డు నిలిపివేస్తున్నట్లు ఆ సెల్ పేర్కొంది. 2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. ఈనెల 8న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పురస్కారం పొందేందుకు జానీ మాస్టర్‌కు ఆహ్వానం అందింది. అయితే పోక్సో కేసు నేపథ్యంలో అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ వెల్లడించింది.
జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు - కారణం ఇదే! - JANI MASTER BAIL
జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ : అయితే తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ సహాయ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో జానీ మాస్టర్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, అలాగే ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు సెల్ పేర్కొంది. కాగా దిల్లీలో జరిగే అవార్డు ఫంక్షన్ కోసం జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పొందారు. ఇందుకు ఆయనకు న్యాయస్థానం ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది.
చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా, టాలీవుడ్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్‌ను తాత్కాలికంగా తప్పించాలని సిఫారసు చేసిన కమిటీ, పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ స్పష్టం చేసింది.
పోలీసు కస్టడీకి జానీ మాస్టర్ - ఈ నెల 28 వరకు ఇంటరాగేషన్ - Jani Master Police Custody
జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ బుధవారానికి వాయిదా - Jani Master Verdict Posteponed