TTD Employees Mistreat Devotees at Tirumala Temple : శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగుల్లో కొంతమంది భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఇటీవల శ్రీవారి బ్రేక్ దర్శనానికి వెళ్తున్న ఓ భక్తుడితో పడికావలిలో పనిచేసే సూపరింటెండెంట్, దఫేదార్ అవమానకరంగా మాట్లాడారు.
టీటీడీ ఛైర్మన్ సిఫార్సు లేఖతో దర్శనానికి వచ్చిన ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యురాలు వరాహస్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో అక్కడ పని చేసే ఉద్యోగి ఆమెను అడ్డుకుని క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించారు. ఈ రెండు ఘటనలు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వివరణ కోసం ఉద్యోగులను పిలిపించారు. అయినా వారు స్పందించలేదు. దీంతో ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేయగా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ - తిరుమలలో గాయని సునీత సందడి
రథసప్తమికి తిరుమల వెళ్తున్నారా? - టీటీడీ సూచనలు అస్సలు మిస్కావొద్దు