ETV Bharat / state

సిద్ధార్ధ కాలేజీలో సీనియర్ ఎన్టీఆర్ - కేరింతలతో దద్దరిల్లిన ఆడిటోరియం - SENIOR NTR AI SPEECH

వీఆర్‌ సిద్దార్థ, డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏఐ హ్యాకథాన్‌ - ఏఐ హ్యాకథాన్‌లో అబ్బురపరిచిన విద్యార్థుల నూతన ఆవిష్కరణలు

SENIOR NTR AI SPEECH
SENIOR NTR AI SPEECH (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 7:36 AM IST

SENIOR NTR AI SPEECH: స్వర్గీయులైన డా.నందమూరి తారకరామారావు వీఆర్ సిద్ధార్ధ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఐ హ్యాకథాన్‌ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడారు. కృత్రిమ మేధస్సు ద్వారా రైతులకు, ప్రజల సమస్యలను తీర్చాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.

అదేంటి ? మరణించిన ఎన్టీఆర్ ఎలా తిరిగొచ్చారని ఆశ్ఛర్యపోతున్నారా ? అవును ఇది నిజమే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ పరిజ్ఞానం ద్వారా స్వర్గీయ ఎన్టీ రామారావును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. కృష్ణా జిల్లా కానూరు వీఆర్‌ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న ‘ఏఐ హ్యాకథాన్‌’లో పీబీ సిద్దార్థ కాలేజీ విద్యార్థులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏఐ విద్యార్ధుల ప్రతిభను అందరూ మెచ్చుకున్నారు. ఎన్టీఆర్ వీడియో చూసి అక్కడ ఉన్న వారంతా కేరింతలతో తమ ఆనందాన్ని తెలియజేశారు.

సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న వివేక్, సాయి శ్రీహర్ష, అనిరుధ్, చాణుక్య, ఇండియన్‌ సర్వర్స్‌ సంస్థ సుమారు నెల రోజుల పాటు కష్టపడి దీన్ని తయారుచేశారు. వందలాది ఎన్టీ రామారావు ఫొటోలను సేకరించి ఏఐ మోడల్‌లో ఎన్టీఆర్‌ చిత్రం తయారు చేశారు. ఫోన్‌ కెమెరా ద్వారా కుర్చీని, వెనుక ఉన్న జనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అనంతరం కుర్చీలో ఎన్టీఆర్‌ కూర్చున్న విధంగా అమర్చారు. ఎన్టీఆర్ మాటలను మిమిక్రీ చేసి ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ, ఏఐ సాయంతో ఎన్టీఆర్‌ మాట్లాడుతున్నట్లుగా సృష్టించారు. ఈ కార్యక్రమానికి వచ్చినవారంతా ‘ఏఐ ఎన్టీఆర్‌’ను చూసి ఆశ్చర్యపోయారు.

అబ్బురపరిచిన విద్యార్థుల ఆవిష్కరణలు: ఈ హ్యాకథాన్​లో దేశవ్యాప్తంగా 60 విద్యాసంస్థలకు చెందిన 1200 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని సీఎస్ ఈ విభాగాధిపతి డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులకు నగదు ప్రోత్సహకాలను అందించారు. మాట్లాడే రోబో, అటానమస్ కార్లు, డ్రోన్స్, గేమ్ ఛేంజర్స్, కోడింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. హ్యాకథాన్​లో పలు నూతన ఆవిష్కరణలతో విద్యార్థులు అబ్బురపరిచారు.

ఆధునిక పరిజ్ఞానం వినియోగించి తయారు చేసిన అటానమస్ కార్లు అందరినీ ఆకట్టుకున్నాయి. డ్రైవర్ లేకుండా కెమెరాతో ముందున్న వస్తువులను చిత్రీకరిస్తాయి. ఆబ్జక్ట్ సెన్సార్ల ద్వారా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టకుండా వాటంతట అవే దారి మళ్లించుకుని వెళ్లిపోతాయి. ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భవిష్యత్​లో రాబోయే కార్లు ఇవేనంటున్నారు టెక్నాలజీ నిపుణులు.

రెండో రోజు జరిగిన కార్యక్రమంలో ఆగ్యుమెంట్ రియాలిటీ పరిజ్ఞానం ద్వారా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ హ్యాకథాన్​ను ఉద్దేశించి ప్రసంగించినట్లుగా విద్యార్ధులు వీడియోను రూపొందించారు. ఈ వీడియో అందరినీ ఆలోచింపచేసింది. రెండు రోజుల పాటు జరిగిన హ్యాకథాన్​లో 8 విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించారు.

ఎడ్యుకేషన్​లోనూ ఏఐ- రూ.500కోట్లు కేటాయించిన కేంద్రం

దోస్తీ చేసే AI సోషల్ రోబోస్- ఒంటరిగా ఫీలయ్యేవారి పట్ల స్పెషల్ కేర్- ముద్దుముద్దు మాటలతో నయా ఎనర్జీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.