గ్రూప్-1 మెయిన్స్ 1:100 ప్రకటించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి - హరీశ్‌రావుకు వినతిపత్రం - Group1 candidates plea to harishrao - GROUP1 CANDIDATES PLEA TO HARISHRAO
Published : Jun 17, 2024, 8:02 PM IST
Group1 candidates Plea to Harishrao : గ్రూప్ వన్ మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిని పాటిస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇపుడు దానిపై మాట్లాడడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన అభ్యర్థులు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ప్రైవేట్ ఉద్యోగాలు పక్కన పెట్టి మరీ చదువుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు. గ్రూప్- 2, గ్రూప్- 3 కింద ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎన్ని భర్తీ చేస్తామో చెప్పడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే పోస్టుల సంఖ్యను పెంచి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వడం లేదని, పెంచిన పోస్టులతో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం హామీలను అమలు చేయాలని, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.