ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న కొండవాగులు - గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం నిలిపివేత - Gubbala Mangamma Temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 1:05 PM IST

Over Flowing Hill Stream in Gubbala Mangamma Temple at Eluru District : ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో  బుట్టాయిగూడెం మండలం కామవరం అడవి ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆలయం వద్ద వాగుల ఉద్ధృతి తగ్గే వరకు భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. వరదల దృష్ట్యా అమ్మవారి దర్శనాలు నిలిపివేశామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మవారి దర్శనానికి భక్తులు ఎవరూ రావద్దని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులు ఎవరూ రావద్దని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details