ETV Bharat / state

'జగన్ అయినా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందే' - SHARMILA RESPONSE ON JAGAN COMEMNTS

అసెంబ్లీకి వెళ్లనివారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల - అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే ఇక పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్న

Sharmila Response on YS Jagan Comemnts
SHARMILA_ON_YS_JAGAN (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 10:21 PM IST

Sharmila Response on YS Jagan Comemnts: అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందే అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లనంటున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ అయినా, మిగతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందే అని షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే ఇక పదవుల్లో ఉండటం ఎందుకు అని షర్మిల ప్రశ్నించారు.

ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ ప్రకటించడంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. కాగా ప్రతి పక్ష నేతగా తనకు గుర్తింపు ఇవ్వడం లేదని, ఎమ్మెల్యేలాగా రెండు నిముషాల మైక్ ఇస్తే అసెంబ్లీకి వెళ్లి లాభమేంటని ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సమావేశాలు జరిగే రోజుల్లో ప్రతి రోజూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై మాట్లాడతామని జగన్ తెలిపారు. ఈ విషయంలో జగన్‌ తీరును షర్మిల తీవ్రంగా పరిగణించారు.

ఆయనగారు అసెంబ్లీకి రారంట - ఇంట్లో కూర్చుని రికార్డు వీడియోలు వదులుతాడంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.