అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్ - ఒకరు మృతి, మరొకరికి గాయాలు - Bike Accident in meerpet - BIKE ACCIDENT IN MEERPET
Published : Jul 7, 2024, 3:53 PM IST
One Killed Another Injured After Bike Hits Pole In Meerpet : విద్యుత్ పోల్‌కు బైక్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లేల్ గూడ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంజినీరింగ్ చదువుతున్న వంశీ, అభినవ్ ఇద్దరు స్నేహితులు కలిసి పల్సర్ బైక్ మీద మంద మల్లమ్మ నుంచి మీర్‌పేట్ వైపు వెళ్తుండగా జిల్లేల్ గూడ పాత గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, అభినవ్ అనే మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గాయపడిన అభినవ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.