బాసరలో ప్రసాదం పంపిణీలో అధికారుల చేతివాటం - ఏం చేశారో తెలిస్తే!! - Prasadam Scam in basara - PRASADAM SCAM IN BASARA
Published : Jun 29, 2024, 12:55 PM IST
Scam in Basara Prasadam Distribution : బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్‌లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్‌లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ తతంగాన్ని గమనించిన స్థానికులు వారిని పట్టుకుని ఆలయ ఈవో విజయ రామారావుకు అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రసాదం తయారు చేసే కౌంటర్ నుంచి పులిహోర ప్యాకెట్లను తీసుకువచ్చారు.
వాటిని తీసుకువచ్చేటప్పుడు అక్కడ ఉన్న అధికారి రిజిస్టర్లో 350 పులిహోర ప్యాకెట్లు ఉన్నట్లు నమోదు చేశారు. కానీ ఆటోలో ఉన్నవి 640. అనుమానం వచ్చిన భక్తులు, గ్రామస్థులు పరిశీలించగా వారి బాగోతం బయటపడింది. విషయాన్ని ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు బాధ్యులుగా గుర్తుంచిన ఆలయ పర్యవేక్షకుడు శివరాజ్, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేశారు. వీరితో పాటు నలుగురు తాత్కాలిక ఉద్యోగులను తొలగించామని ఆలయ ఈవో తెలిపారు.