అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ధర్మపురి అర్వింద్ - Dharmapuri Arvind meet BJP IT Cell - DHARMAPURI ARVIND MEET BJP IT CELL
Published : Apr 10, 2024, 5:22 PM IST
Dharmapuri Arvind meet BJP IT Cell : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని, బీజేపీ ఐటీసెల్ సభ్యులకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. నిజామాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో, బీజేపీ ఐటీ సెల్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటి టెక్నాలజీని వాడుకుని ప్రతిపక్ష నేతలు, తన గొంతుతో, తన పేరుమీదుగా ఫేక్ వాయిస్ వీడియోలు తయారుచేసే అవకాశం ఉందన్నారు. ఇటువంటి ఫేక్ ప్రచారం పట్ల ఐటీసెల్ బృందం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
బీజేపీపై చేసే ఆరోపణలపై, కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యర్ధి పార్టీల అసత్య ప్రచారాలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే నెల రోజులు కీలకమని, మరింతగా పనిచేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.