LIVE: జగన్ హింసా రాజకీయాలను తిప్పి కొట్టిన ఓటర్లు - ఎన్డీఏ నేతల మీడియా సమావేశం - NDA Leaders Media Conference - NDA LEADERS MEDIA CONFERENCE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2024, 3:09 PM IST
|Updated : May 14, 2024, 3:19 PM IST
NDA Leaders Media Conference LIVE : ఐదేళ్లపాటు అడ్డూ అదుపు లేకుండా అరాచకం సాగించిన వైసీపీ, చివరికి పోలింగ్‌రోజూ అదే విధ్వంసకాండ కొనసాగించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో, హింసకు దిగింది. దాదాపు ప్రతి జిల్లాలోనూ ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై, దాడులు, కిడ్నాప్‌లతో ఓటర్లను భయాందోళనకు గురిచేసింది. రాళ్లు రువ్వడం వాహనాలు ధ్వంసం చేస్తూ రక్తపాతం సృష్టించింది. రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో, హింసకు దిగింది.చిత్తూరు జిల్లాలో నియంతృత్వం సాగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు పోలింగ్ రోజు అడ్డేలేకుండా పోయింది. ఆయన సొంతమండలం సదుంలోని, బూరగమంద పోలింగ్‌కేంద్రంలో తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా ఉండేందుకు వెళ్తున్న వైసీపీ కార్యకర్తలను పెద్దిరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు. మూడు కార్లలో ఎక్కించుకుని, దుగ్గంవారిపల్లెలోని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి బెదిరించారు. తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా ఉంటే, మెడకాయలపై తలకాయలు ఉండవంటూ హెచ్చరించి వారి ఫోన్లు లాక్కున్నారు. ఈ వ్యవహంరం, కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వారిని వదిలేశారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులతో వైఎస్సార్సీపీ నేతలు చెలరేగిపోయారని ఎన్డీఏ నేతలు మండిపడుతున్నారు. జగన్ హింసా రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టారని అంటూ .. మంగళగిరిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ప్రత్యక్షప్రసారంలో మీరూ వీక్షించండి..
Last Updated : May 14, 2024, 3:19 PM IST