ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ, జనసేన నేతలతో లావు శ్రీకృష్ణదేవరాయలు వరుస భేటీలు - ఆ సీటు ఆయనకేనా? - టీడీపీ నేతలతో శ్రీకృష్ణదేవరాయలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 2:10 PM IST

Narasaraopet MP Lavu Krishna Devarayalu Meetings : పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల అధికార పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నరసరావుపేట నియోజకవర్గంలో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలతో భేటీ అయ్యి పలు అభివృద్ధి  పనులపై చర్చలు జరుపుతున్నారు.

Narasaraopet TDP MP Candidate Lavu Krishna Devarayalu? : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము కార్యాలయంలో జొన్నలగడ్డ టీడీపీ కార్యకర్తలతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అదే విధంగా రావిపాడు గ్రామంలో టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. అలాగే నరసరావుపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ సయ్యద్ జిలానీతో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆయా సమావేశాలలో తాను ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ప్రస్తుతం ఎంపీ ప్రజల కోసం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న తనకు పూర్తి సహకారం అందించాలని, సమావేశంలో లావు శ్రీకృష్ణదేవరాయలు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details