తెలంగాణ

telangana

ETV Bharat / videos

దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందన్న దొంగ - కడుపు నిండా తినిపించి మరీ! - Nalgonda Theft Viral Video - NALGONDA THEFT VIRAL VIDEO

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 1:26 PM IST

Nalgonda Theft Viral Video : దొంగలకు పాత చెప్పైనా బంగారమే. అర్ధరాత్రి అయిందంటే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. చడీచప్పుడు కాకుండా ఇళ్లలోని నగదు, బంగారాన్ని చోరీ చేస్తున్నారు. బడి, గుడి, ప్రభుత్వ సంస్థలు, ఇళ్లు ఇలా ఏదైనా సరే, అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను స్థానికులు పట్టుకున్నారు. గ్రామస్థులంతా కలిసి దేహశుద్ధి చేస్తుండగా, ఆ దొంగ ఆకలి వేస్తుందని చెప్పడంతో పులిహోర తినిపించి మరీ దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ దొంగను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ దొంగపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. 

ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న బంగారం, విలువైన వస్తువులు వెంట తీసుకొని వెళ్లాలని ప్రజలకు పోలీసులు సూచించారు. తోటి వారిని తమ ఇంటివైపు ఓ కంట కనిపెడుతూ ఉండాలని కోరాలని సూచించారు. కొత్త వ్యక్తులు, ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details