వివాదంలో మున్సిపల్ కమిషనర్ చేకూరి కీర్తి- సెలవు తీసుకుందని పారిశుద్ధ్య కార్మికురాలి ఉద్యోగం తొలగింపు1
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 3:32 PM IST
Municipal workers allegations on Guntur Municipal Commissioner: ఇంట్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికురాలి పట్ల గుంటూరు కమిషనర్ చేకూరి కీర్తి (Chekuri Kirti) వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. పిడుగురాళ్ల సుధ అనే మహిళ 24 ఏళ్లుగా మున్సిపల్ కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. గత 9 నెలలుగా అధికారుల సూచన మేరకు కమిషనర్ ఇంట్లో పని చేస్తున్నారు. మనవరాలి ఫుష్పాలంకరణ కార్యక్రమం ఉండటంతో కమిషనర్ కు చెప్పకుండా 3 రోజులు సెలవు పెట్టినట్లు కార్మికులు సుధ తెలిపారు.
తన అనుమతి తీసుకోకుండా సెలవులు ఎలా పెడతావంటూ కమిషనర్ కీర్తి ఆరోజు నుంచి విధులకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా తప్పు మన్నించమని, కమిషనర్ చుట్టూ తిరిగినా కనికరించడం లేదని సుధ వాపోయారు. బాధితురాలి సుధను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. కార్మికురాలు సుధకు న్యాయం చేయకుంటే పోరాటం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. కమిషనర్ ఇంట్లో సుమారు 15 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.