ఎంఐఎంకు భయపడే కాంగ్రెస్ విమోచన దినోత్సవాన్ని జరపడంలేదు : రఘునందన్‌రావు - Raghunandan Rao on Liberation Day
Published : Sep 17, 2024, 3:09 PM IST
MP Raghunandan Rao on Hyderabad Liberation Day : తెలంగాణ విమోచన దినోత్సవం అనే పేరు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఎందుకు భయ పడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలో ఎన్‌ఎస్వీ బ్లడ్‌బ్యాంక్‌లో నిర్వహించిన బ్లడ్ డోనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1200మంది ఆత్మబలిదానాలను అగౌరవ పరిచిందన్నారు.
కర్ణాటకలోని కాంగ్రెస్, మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వాలు విమోచన దినోత్సవంగా జరుపుతుంటే రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవంగా ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించారు. లిబరేషన్ డే పై తెలంగాణ ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు తెలపడం లేదని అడిగారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు.