తెలంగాణ

telangana

ఊరు దాటాలంటే సర్కస్ ఫీట్స్ చేయాల్సిందే - ఈ బ్రిడ్జిపై ప్రయాణం నరకం - MOTHE VAGU BRIDGE ISSUE IN RAMADUGU

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 12:33 PM IST

mothe River Bridge Issue in Karimnagar (ETV Bharat)

Mothe Vagu Bridge Issue in Karimnagar : కరీంనగర్ జిల్లా రామడుగులోని మోతె వాగు వంతెన ప్రయాణం సర్కస్ ఫీట్లను తలపిస్తోంది. ఇక్కడి పాత వంతెన ఏడాది క్రితం కుంగిపోవటంతో మట్టి నింపారు. వర్షాలు కురుస్తుండగా నిత్యం వందలాది వాహనాలు నడిచి అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. గుంతల వల్ల దీనిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనం అదుపు తప్పితే వాగులోకి పడిపోతుందని ప్రయాణికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వంతెనపై నిత్యం కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన 60 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వంతెన స్థానంలో రూ. 8 కోట్లతో కొత్త వంతెన నిర్మించారు. కానీ బ్రిడ్జికి రెండు చివర్లలో భూసేకరణ పూర్తి చేయలేదు. పరిహారం చెల్లించక పోవటంతో భూనిర్వాసిత రైతులు కొత్త వంతెన  చివరి భాగంలో గుడిసెలు వేసుకొని దారి మూసివేశారు. భూసేకరణకు పరిహారంగా ఎకరం 30 గుంటల స్థలానికి రూ.2 కోట్లు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంది. చివరి దశలో చెల్లింపు నిలిచిపోవడంతో కొత్త వంతెనను ప్రారంభించడం లేదు. ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో పాత వంతెన పై ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details