తెలంగాణ

telangana

ETV Bharat / videos

వానరాలకు ఆత్మీయ విందు - ఉత్సాహంగా స్వీకరించిన కోతులు - Soulful feast for the monkeys HYD - SOULFUL FEAST FOR THE MONKEYS HYD

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 5:55 PM IST

Updated : May 31, 2024, 6:13 PM IST

Monkey Buffet Festival in Hyderabad : నీరు, ఆహారం దొరకక చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఏదో ఒక పని చేసుకుని కొందరు జీవిస్తున్నారు. మరి మనతో పాటే సమాజంలో జీవిస్తున్న మూగజీవుల పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవి నిత్యం ఆహారం కోసం ఇబ్బందులు పడతున్నాయి. మరికొన్ని ఆహారం, నీరు సరైన సమయానికి అందక చనిపోతున్నాయి. అలాంటి జీవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ టూరిజం శాఖ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. భాగ్యనగరంలోని వనస్థలిపురంలో వానరాలకు ఆత్మీయ విందును జాగృతి అభ్యుదయ సంఘం ఏర్పాటు చేసింది.

Monkey Take Fruits Video : వానరాలకు ఆత్మీయ విందు వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి కోహెడ గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వరకు బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ క్రమంలో దేవాలయాల దగ్గర కోతులకు అరటి, జామ పండ్లు, క్యారెట్, పల్లీలు తదితర ఆహార పదార్థాలు అందజేశారు. వాటిని వానరులు అధిక సంఖ్యలో వచ్చి తిన్నాయి.

Last Updated : May 31, 2024, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details