తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాంగ్రెస్ పార్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది : కల్వకుంట్ల కవిత - MLC Kavitha Latest Comments

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 3:02 PM IST

MLC Kavitha Fires On Congress In Jagtial : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్​పల్లి బీఆర్​ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ పార్టీ పదేళ్లలో పాలనలో పరిపాలన సాఫీగా సాగిందన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కరెంట్, త్రాగునీరు రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వానికి సమస్యలు విన్నవిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 

MLC Kavitha Comments On Jivan Reddy : జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్​ఎస్​ కార్యకర్తలపై కక్షపూరితంగా వెంటపడుతున్నాడని దీనిని ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. బీఆర్​ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని, రాష్ట్రంలో ఆడపిల్లలకు, విద్యార్థులకు, రైతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బీఆర్​ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని వారికి పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని కార్యకర్తల్లో భరోసా నింపారు.

ABOUT THE AUTHOR

...view details