హుజూరాబాద్ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ - MLC Venkat Fireson Sand Mafia
Published : Feb 11, 2024, 3:25 PM IST
|Updated : Feb 11, 2024, 4:07 PM IST
MLC Balmoori Venkat Fires on Sand Mafia : హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఈ విషయాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. నియోజకవర్గ బాధ్యులు వొడితల ప్రణవ్‌తో కలిసి హుజూరాబాద్‌కు చేరుకోగా స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అంబేడ్కర్ కూడలి వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడిన ఆయన, అక్కడున్న శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తాను నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా మార్చాలని గతంలోనే చర్చించుకున్నామని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై దృష్టి పెడితే, తప్పనిసరిగా జిల్లా ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు సమానమేనని, గత ప్రభుత్వం చేసినట్లుగా తాము చేయబోమని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తన ఎమ్మెల్సీ ల్యాడ్ నిధుల నుంచి తొలిత రూ.50 లక్షలు హుజూరాబాద్ అభివృద్ధికే కేటాయిస్తానని బల్మూరి వెంకట్ ప్రకటించారు.