LIVE :ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియా సమావేశం - SOMIREDDY LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2024, 12:12 PM IST
|Updated : Oct 24, 2024, 12:17 PM IST
MLA Somireddy Live : వైఎస్సార్సీపీ నేతల మాదిరిగా సహజ వనరులను ఎవరూ దోచుకోరని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎవరూ దోపిడీ చేయకూడదన్నదే సీఎం చంద్రబాబు ఉద్దేశమన్నారు. ఆయన ఓర్పును మాటల్లో చెప్పలేమని తెలిపారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు సృష్టించింది వైఎస్సార్సీపీనే అని అరోపించారు. వై నాట్ 175 అని ప్రగల్భాలు పలికిన వైఎస్సార్సీపీకి కనీసం ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా ప్రజలు చెంప దెబ్బ కొట్టారని సోమిరెడ్డి దుయ్యబట్టారు. దాడుల సంస్కృతి తమది కాదని గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యాసలో తాముంటే, వారి దాడుల గోలేంటి అని మండిపడ్డారు. ప్రజల్ని నరికి, నరికి, హింసించినప్పుడు ఈ భయం తెలియలేదా అని ప్రశ్నించారు. తాజాగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Last Updated : Oct 24, 2024, 12:17 PM IST