పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది చేతివాటం - ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం - MLA Julakanti on secretariat staff - MLA JULAKANTI ON SECRETARIAT STAFF
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 11:01 PM IST
MLA Julakanti Brahma Reddy Angry on Secretariat Staff : ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చేతివాటం చూపిన సచివాలయ సిబ్బందిపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పెంచిన పింఛనుతో కలిపి లబ్ధిదారులకు 7 వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. మాచర్లలోని ఎరుకల కాలనీలో సచివాలయ వెల్‌ఫేర్ అధికారి 6 వేల 5 వందల రూపాయలు మాత్రమే అబ్ధిదారులకు ఇవ్వడం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం స్థానికులు టీడీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందిని ప్రశ్నించగా వారు స్పందించ లేదు. తెలుగుదేశం నేతల ద్వారా సచివాలయ సిబ్బంది డబ్బుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. విచారణలో వెల్‌ఫేర్ అధికారి లబ్ధిదారుల నుంచి 5 వందల రూపాయలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. సచివాలయ వెల్‌ఫేర్ అధికారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.