తెలంగాణ

telangana

భూపాలపల్లిలో మంత్రుల పర్యటన - ఇండస్ట్రియల్‌ పార్క్‌కు శంకుస్థాపన - Mylaram Industrial Park

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 2:21 PM IST

Ministers Will Laying Foundation Stone To Industrial Park (ETV Bharat)

 Industrial Park At Bhupalpally : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క పర్యటించారు. గాంధీనగర్ క్రాస్ మైలారం గుట్టపైన ఇండస్ట్రియల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుట్టపై మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గతంలో యువతను వాడుకొని మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ  ఇప్పుడు యువతను ఉద్యోగాల పేరుతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

 ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ నెల ఆఖరులోపే 4 లక్షల 50వేల ఇళ్లు ఇచ్చేందుకు సర్కార్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపాధికన ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.  గతంలో రుణమాఫీ నాలుగుసార్లు చేసినా రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తే బీఆర్‌ఎస్‌ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పనిచేస్తోందని మంత్రి శ్రీధర్‌ బాబు ఉద్ఘాటించారు. 

ABOUT THE AUTHOR

...view details