LIVE : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ - ప్రత్యక్షప్రసారం - minister uttam press meet live
Published : Apr 15, 2024, 5:21 PM IST
|Updated : Apr 15, 2024, 5:34 PM IST
హైదరాాబాద్ గాంధీ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏసంగిలో ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, మార్చి 25 నాటికే మేము కొనుగోలు కేంద్రాలు తెరిచామన్నారు. ఇప్పటికే 6,919 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని తెలిపారు. నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గతేడాది ఏప్రిల్ 1 నాటికి కేవలం 339 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తవుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విపక్షాలు చేసే నిరాధార మైన ప్రచారం నమ్మవద్దని వారికి సూచించారు.
Last Updated : Apr 15, 2024, 5:34 PM IST