మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హమాలి కార్మికులకు వైద్య పరీక్షలు - Ponnam Orders On Medical Tests
Published : Jan 20, 2024, 2:27 PM IST
Minister Ponnam Prabhakar Orders On Medical Tests : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి పైగా హమాలి కార్మికులకు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. హుస్నాబాద్‌లోని ఆదర్శ, అంబేడ్కర్ హమాలీ కార్మిక సంఘాలతో గత కొన్ని రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై కార్మికులకు వైద్య సేవలు చేపిస్తానని హామీ ఇచ్చాడు. హామీ మేరకు నేడు వైద్య సిబ్బంది హమాలి కార్మికులకు వివిధ రకాల వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు.
తమ ఆరోగ్యం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్న చొరువ పట్ల హమాలి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్య పరీక్షలను నిర్వహించినట్లు టిపిసిసి సభ్యుడు కేడం లింగమూర్తి తెలిపారు. ప్రతి కార్మికుడి ఆరోగ్య వివరాలను తెలుసుకొని అవసరమైన మందులను, చికిత్సను అందించడానికి ఈ పరీక్షలు దోహదపడతాయన్నారు. భవిష్యత్తులో మరింత మంది కార్మికులకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.