'ఈ గీత కార్మికుల సేఫ్టీ కిట్ 1500 కిలోల బరువును తట్టుకుంటుంది' - PONNAM PRABHAKAR ON KATAMAYYA KITS
Published : Oct 10, 2024, 2:53 PM IST
Ponnam Prabhakar Distributed Katamayya Kits : కరీంనగర్లో ఓ ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన వారితో, సాంకేతికంగా ఎన్ఐటీ అప్రూవల్తో గీతా కార్మికులకు రక్షణ కోసం కాటమయ్య సేఫ్టీ కిట్ రూపకల్పన చేసినట్లు తెలిపారు, 1500కిలోల బరువును కూడా తట్టుకునే విధంగా తయారు చేసినట్లు చెప్పారు. గీతా కార్మికులు తాటి చెట్టు ఎక్కిన వారి ప్రాణాలు రక్షించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
మొదటి దశలో హైదరాబాద్ మినహా 100 నియోజకవర్గాల్లో 10 వేల కిట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. రిజిస్టర్ చేసుకున్న 2 లక్షల మంది గీతా కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కాటమయ్య రక్షణ కవచం మీద అవగాహన కల్పించాలని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా గీత కార్మికులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు.