ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్ర విభజన కంటే జగన్​ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగింది : మంత్రి నిమ్మల - Minister Nimmala Fire on YCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 3:37 PM IST

Minister Nimmala Ramanaidu Fire on Past YCP Government : గత ప్రభుత్వం ఒక్క జలవనరుల శాఖలోనే 18వేల కోట్ల రూపాయల బకాయి పెట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019-24మధ్య ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. కొంతమంది అధికారులు కూడా ఇంకా పాత విధానంలోనే ఉన్నారని విమర్శించారు. ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటున్నామని తెలిపారు. ఉన్నతాధికారుల్లోనూ, వ్యవస్థలోనూ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

వైఎస్సార్సీపీకు ఊడిగం చేయటం, వారు చేసిన తప్పులను సరిదిద్దే క్రమంలోనే కొందరు ఉన్నతాధికారులు పనివిధానం మర్చిపోయారనిపిస్తోందని విమర్శించారు. మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రితో పాటు అధికారులు సైతం అక్కడే ఉండి బాధితులకు అండగా ఉన్నారని తెలిపారు. ఇదే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కూటమి సర్కార్​కి ఉన్న తేడా అని తెలిపారు. ప్రజాలకు అత్యవసరమైన ముఖ్యమైన పనులను ముందుగా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. మరుగునపడిన వ్యవస్థల్ని త్వరలోనే గాడిలో పెడతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details