LIVE : మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం - Minister Konda Surekha Press Meet
Published : Feb 8, 2024, 1:30 PM IST
|Updated : Feb 8, 2024, 1:41 PM IST
Minister Konda Surekha Press Meet Live : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కవిత డీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలన్న డిమాండ్‌పై మంత్రి స్పందించారు. కల్వకుంట్ల కవిత మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారని విమర్శించారు. మరోవైపు ఎల్లుండి జరిగే బడ్జెట్ సమావేశాల గురించి కూడా ప్రస్తావించారు. బడ్జెట్‌లో అన్ని శాఖలకు, అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా కేటాయింపులు జరిపినట్లు చెప్పారు. అలాగే మరికొద్ది రోజుల్లో రానున్న మేడారం జాతర ఏర్పాట్ల గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మేడారం వెళ్లలేని భక్తులు ఆన్‌లైన్‌లో మొక్కులు చెల్లించుకునేందుకు సేవలు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సేవలను అవసరం ఉన్న వారు వినియోగించుకోవాలని సూచించారు. మేడారం జాతరకు వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ 6వేల ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు