నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి : మంత్రి వెంకట్రెడ్డి - Komati Reddy on Ganesh Celebrations - KOMATI REDDY ON GANESH CELEBRATIONS
Published : Sep 8, 2024, 12:45 PM IST
Minister Komatireddy Venkatreddy On Ganesh Celebrations : రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు కనుల పండువగా జరిగాయి. మండపాల్లో గణనాథులు కొలువుదీరారు. ఈ సందర్బంగా రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ఉత్సాహంగా, భక్తిపరంగా జరుపుకోవాలని తెలిపారు. నల్గొండ పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లోని వినాయక విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు వినాయకుని నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. గణేశ్ నిమజ్జనం వరకు అందరూ కలిసి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. రైతులు, నిరుపేదలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ బాగుండాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా గణేశ్ నిమజ్జనం వరకు పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.