వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది : వెంకటరెడ్డి - minister komatireddy comments - MINISTER KOMATIREDDY COMMENTS
Published : Aug 29, 2024, 10:28 PM IST
Minister Komatireddy Laid Foundation Stone for Development Works : వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పట్టణంలోని బొట్టుకూడా ప్రభుత్వ పాఠశాలలో నూతన భవనానికి శంకుస్థాపన పనులు చేశారు. అనంతరం అక్కడి నుంచి కనగల్ మండలంలోని చిన్నామాదరం గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి ప్రసంగించారు.
తెలంగాణ కోసం జైలుకు వెళ్లి వచ్చిన స్వాతంత్య్ర యోధురాలు లాగా బాంబులు కాలుస్తూ ర్యాలీలు చేయడం ఏంటని ఎమ్మెల్సీ కవితపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్స్ చేశారు. పాపం తగిలి కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. సొరంగ మార్గానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ నల్గొండ జిల్లా అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. తనను ఆరుసార్లు గెలిపించిన నల్గొండ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తమ రుణం తీర్చుకుంటానని తెలిపారు.