ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బస్సులో మినీ లైబ్రరీ - యువ డ్రైవర్​ వినూత్న ఆలోచన - MINI LIBRARY IN BUS - MINI LIBRARY IN BUS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 2:51 PM IST

Mini Library Bus in Tirupati : మెుబైల్‌ ఫోన్‌ వచ్చాక పుస్తకాలను వదిలేశాం. అయితే మెుబైల్‌లో ఉన్న ప్రయోజనాలను కెరీర్‌ కోసం కాకుండా కాలక్షేపాలకు ఉపయోగిస్తున్నాం. దాంతో విలువైన సమయంతోపాటు జ్ఞానాన్ని కోల్పోతున్నాం. ఇది గమనించిన కుమార్‌ అనే యువకుడు వినూత్నంగా ఆలోచించి ప్రజలచేత పుస్తకాలని చదివించే ప్రయత్నం చేస్తున్నాడు. తను నడిపే బస్సులోనే మినీ గ్రంథాలయం ఏర్పా టు చేసి నీతి కథలు, జీవిత చరిత్ర పుస్తకాలు, దినపత్రికలు, సాహిత్య పుస్తకాలను అందుబాటులో ఉంచాడు.  

తిరుపతి - మదనపల్లె మధ్య తిరిగే ఏసీ బస్సును నడుపుతున్న కుమార్‍ అనే యువ డ్రైవర్ పుస్తక పఠనం తగ్గిపోతోందని ఆలోచించి  బస్సులో నీతి కథలు, జీవిత చరిత్ర పుస్తకాలు, దినపత్రికలు, సాహిత్య పుస్తకాలను అందుబాటులో ఉంచారు. బస్సు ఎక్కిన వారు గమ్యస్థానాలకు చేరేలోపు చదువుకునేలా ఏర్పాటు చేసిన మినీ గ్రంథాలయంపై కుమార్ చొరవను ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు అభినందిస్తున్నారు. ఫోన్​ పక్కన పెట్టి పుస్తకాలు చదువుతున్న ప్రయాణికులను చూస్తే ఆనందం కలుగుతుందని కుమార్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details