HC on YSRCP Leader Dwarampudi Brother Petition: వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ సోదరుడు వీరభద్రారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తన రొయ్యల ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేస్తూ పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ద్యారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ద్వారంపూడి వీరభద్రారెడ్డికి చెందిన రొయ్యల ప్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(Andhra Pradesh Pollution Control Board) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఏపీపీసీబీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 3కి న్యాయస్థానం వాయిదా వేసింది.
భయపెట్టి ఆస్తి కొట్టేయాలని - డెడ్‌బాడీ పార్శిల్ కేసు ఛేదించిన పోలీసులు
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేత - ఎంపీపీ గది తాళాలివ్వలేదని ఎంపీడీవోపై దాడి