రైతుగా మారిన మెదక్ కలెక్టర్ - భార్యతో కలిసి వరినాట్లు వేసిన రాహుల్‌రాజ్ - Medak Collector Turned As Farmer - MEDAK COLLECTOR TURNED AS FARMER
Published : Aug 4, 2024, 6:49 PM IST
Medak Collector Turned As Farmer : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు రైతులుగా మారారు. అదేంటి అనుకుంటున్నారా? అదేం లేదు తమ క్యాంప్ ఆఫీస్‌ను ఆనుకుని ఉన్న ఔరంగాబాద్ శివారులో నారాయణ అనే రైతు పొలంలో ఇద్దరు పిల్లలను తీసుకుని కూలీలతో కలిసి నారు మడిలో నుంచి వరి నారు తీసి నాట్లు వేశారు. తమ పిల్లలకు వ్యవసాయం ప్రాధాన్యత గురించి తెలియజేశారు. అలాగే రైతుల గురించి వివరించారు.
నారు మడి నుంచి, పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెక్నాలజీ ద్వారా రైతులకు జరుగుతున్న మేలు గురించి ఆరా తీశారు.