తెలంగాణ

telangana

ETV Bharat / videos

YUVA : తెలుగు యువతకు ఫ్రీ ఏఐ ట్రైనింగ్ - 'మాటా' గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిందే! - MATA AI FREE TRAINING FOR - MATA AI FREE TRAINING FOR

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 4:42 PM IST

MATA Free AI Training For Telugu Students : ఇప్పుడు ఎవరి నోట విన్నా AI (కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)) మాటే. అన్ని రంగాల్లో ప్రభావం చూపుతున్న కృత్రిమ మేధపై పట్టు సాధిస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏఐ శిక్షణను ఉచితంగా అందిస్తోంది 'మన అమెరికన్ తెలుగు అసోసియేషన్‌-మాటా (MATA)'. లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థుల భవిత కోసం కృషి చేస్తోంది ఈ అసోసియేషన్. సెప్టెంబరు 2వ తేదీన 210 మందితో తొలి బ్యాచ్ ప్రారంభమైంది. తొలి విడతలో వేయి మందికి శిక్షణ ఇస్తున్నారు. వీలైనంత మంది తెలుగు యువతకు ఏఐలో శిక్షణ ఇవ్వడమే ఈ అసోసియేషన్ ధ్యేయం. మరి, ఉచిత ఏఐ శిక్షణకు విద్యార్థుల  విద్యార్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది.? ఎంత మందికి శిక్షణను ఇస్తారు? తదితర వివరాలను 'మాటా' అధ్యక్షుడు శ్రీనివాస్ గనగొని అడిగి తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details