రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అతిథిగా సోనియాగాంధీ వస్తున్నారు: మల్లు రవి - Mallu Ravi TS Decade Celebrations - MALLU RAVI TS DECADE CELEBRATIONS
Published : May 25, 2024, 7:28 PM IST
Mallu Ravi on Telangana Formation Day 2024 : రైతులకు రుణమాఫీ ఆగస్టు 15లోపే చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. రాష్ట్రంలో అన్నదాతలు ముఖ్యమంత్రి మాటలు నమ్ముతున్నారని అన్నారు. కర్షకుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురించి మాట్లాడారు. పది సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ప్రత్యేక వాతావరణంలో ఈ ఉత్సవాలను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.
Mallu Ravi Says Telangana Decade Celebrations : తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ జూన్ 2వ జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరవుతారన్నారని పార్టీ నేత మల్లు రవి తెలిపారు. తెలంగాణ సాధన కోసం పని చేసిన అన్ని పార్టీలను ఆహ్వానించనున్నట్లు వివరించారు. జయ జయహే తెలంగాణ గీతం, సవరించిన రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు.