తెలంగాణ

telangana

ETV Bharat / videos

గణతంత్ర వేడుకల్లో కళ్లు తిరిగి పడిపోయిన మహమూద్​ అలీ - హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు - మహమూద్​ అలీకి అస్వస్థత

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 3:11 PM IST

Mahmood Ali Fainted At Republic Day Celebrations 2024 : రాష్ట్రవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం తరఫున హైదరాబాద్​ నాంపల్లి పబ్లిక్​ గార్డెన్​లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శాసనసభ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో సభాపతి గడ్డం ప్రసాద్​ కుమార్​ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గాంధీజీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.

Mahmood Ali Fainted Video Viral : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సైతం తమ తమ పార్టీ కార్యాలయాల్లో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్​ తెలంగాణ భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే పార్టీ శ్రేణులు ఆయణ్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బీఆర్​ఎస్​ నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details