LIVE : లోక్‌సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Lok Sabha Live 2024
Published : Aug 8, 2024, 11:06 AM IST
|Updated : Aug 8, 2024, 8:13 PM IST
Lok Sabha Budget Session Live : లోక్‌సభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. గత సభలో బడ్జెట్‌పై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే కేంద్రం (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌కు గత లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌కు, మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాణి ఓటుతో సమ్మతిని వెల్లడించింది. గత సమావేశాల్లో కేరళ వయనాడ్‌లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై పార్లమెంట్ వేదికగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరోవైపు ఈ సమావేశాల్లో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు, భారత్ తీసుకుంటున్న అప్రమత్త చర్యల గురించి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నరాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. బంగ్లాలో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు జులైలోనే స్వదేశానికి వచ్చేశారని చెప్పారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇక ఇవాళ్టి లోక్‌సభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : Aug 8, 2024, 8:13 PM IST