Horoscope Today December 1st, 2024 : డిసెంబర్ 1వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వీరికి వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తి మీకు ఈ రోజు తారసపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరిపైనా ప్రతీకార చర్యలకు దిగవద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు, స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. కుటుంబంలో కలహాలు వచ్చే సూచన ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్యం రీత్యా ఈ రోజు చాలా బద్దకంగా, పనిపట్ల అనాసక్తితో ఉంటారు. సంతానం పురోగతి పట్ల ఆందోళనతో ఉంటారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎవరితోనూ అనవసరమైన వాదనల్లోకి దిగవద్దు. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. దుర్గాస్తుతి పారాయణ మేలు చేస్తుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలతో, చురుగ్గా పనిచేసి విజయాలను అందుకుంటారు. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులు, స్నేహితుల అండతో సమస్యల నుంచి బయట పడతారు. విద్యార్థులు విజయం కోసం తీవ్రంగా శ్రమించాలి. స్థిరాస్తి పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ అభిప్రాయాలతో ఏకీభవించే వ్యక్తులను ఈ రోజు కలుసుకుంటారు. వృత్తిపరంగా ఎదగడానికి ఈ పరిచయం దోహదపడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కోర్ట్ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేసే పనులకు చెప్పే మాటలకు మధ్య తేడా రాకుండా జాగ్రత్త పడండి. ఇతరులు అపార్థం చేసుకునేలా వ్యవహరించవద్దు. బంధువుల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా మాట్లాడండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. శ్రీలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుపై నమ్మకంతో అధికారులు మీకు అనేక సవాళ్లతో కూడిన బాధ్యతలు అప్పగిస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలు, పరోపకార కార్య కలాపాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వారితో ఈ రోజు సమావేశమవుతారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిని కలుసుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. సన్నిహితుల నుంచి అద్భుతమైన కానుకలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీరామ నామజపం శక్తినిస్తుంది.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన ఆందోళనతో అనిశ్చితికి లోనవుతారు. వృత్తి, వ్యాపారాలకు అనారోగ్య పరిస్థితి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభకరం.