కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లు - పేద ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్నాయి : కూనంనేని - Kunamneni on Assembly Session - KUNAMNENI ON ASSEMBLY SESSION
Published : Aug 4, 2024, 6:20 PM IST
MLA Kunamneni Sambasiva Rao Fires on BJP : ఈ మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు పేద ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్నాయని కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా పన్నులు రద్దు చేస్తూ రూ.లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడాన్ని తప్పుబట్టారు, కానీ పేదలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా మేలు జరిగే విధంగా ఉండాలన్నారు.
పేద ప్రజలకు ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు కమ్యూనిస్టులు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని సూచించారు. శాసనసభలో ఏ పార్టీ నేతలు ప్రజల అవసరాల గురించి మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పరిష్కృతం చేయని ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం ఉందని అన్నారు.