తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ భవన్​లో కేటీఆర్ మీడియా సమావేశం - KTR Press Meet Live - KTR PRESS MEET LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 10:14 AM IST

Updated : Apr 3, 2024, 10:39 AM IST

KTR Press Meet in Telangana Bhavan Live : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతులను ఆదుకోవడానికి వరికి బోనస్, రైతు భరోసా అమలు, రుణమాఫీ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఎకరానికి రూ. 25,000ల పరిహారం ఇవ్వాలని అన్ని పంటలను రూ.500 రూపాయల బోనస్​తో కొనుగోళ్లు చేయాలన్నారు.కొంత మంది అవకాశ వాదులను, బీఆర్​ఎస్​ను వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో ఆహ్వానించేది లేదని తేల్చి చెప్పారు. ఫోన్​ ట్యాపింగ్ కేసులో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఫైర్ అయ్యారు. తనపై ఆరోపణలు చేసిన నేతలు, తనకు క్షమాపణ చెప్పాలని, లేదంటే వారికి లీగల్​ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ ఇష్టారీతిలో హామీలు ఇచ్చిందని విమర్శించారు. వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Last Updated : Apr 3, 2024, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details