తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్​ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ - ktr participate Medchal live

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 1:28 PM IST

Updated : Feb 2, 2024, 1:43 PM IST

KTR Live : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. కరెంట్ బిల్లు సోనియాగాంధీ కట్టారా, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడిపోతేనే వారు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని తెలిపారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్​కు చేసిందేంటి అని ప్రశ్నించారు.  దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రియమైనవారు కాదని పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ ఇష్టారీతిలో హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి అదానీని తిట్టారని, మోదీ మనిషి అన్నారని, కానీ ఇప్పుడు వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.  

Last Updated : Feb 2, 2024, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details