LIVE : వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ - KTR LIVE IN WARANGAL TODAY - KTR LIVE IN WARANGAL TODAY
Published : May 22, 2024, 12:34 PM IST
|Updated : May 22, 2024, 12:58 PM IST
KTR Meeting in Warangal Live : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్న కేటీఆర్, ఒక్కరికైనా పింఛన్ పెరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 3 వైద్య కళాశాలలే ఏర్పాటయ్యాయని చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆరఎస్ పాలనలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని తెలుపుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మోసపూరితమైన హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీపై పలు విమర్శలు చేస్తున్నారు. అభ్యర్థులు ఆలోచించి ఓటు వేయాలని సూచిస్తున్నారు. విద్యావంతులు, మేధావుల గొంతుకగా ప్రశ్నించే గళంగా పెద్దల సభకు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి కోరుతున్నారు.
Last Updated : May 22, 2024, 12:58 PM IST