పక్కనే చెరువు నిండింది - కాలనీని వరద ముంచెత్తింది - Water in Chitkul Village - WATER IN CHITKUL VILLAGE
Published : Sep 6, 2024, 4:49 PM IST
Flood Water in Chitkul Village: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఎనకచెరువు నిండి చిట్కుల్ గ్రామ పరిధిలోని కాలనీల్లోకి వరదనీరు ముంచెత్తింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పటాన్చెరు మండలం ముత్తంగి ఎనక చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఈ చెరువు నుంచి నీరు బయటకు వచ్చి చిట్కుల్ గ్రామపంచాయతీ పరిధిలోని రాధాకాలనీ, నాగార్జున కాలనీల్లో ఇళ్ల మధ్య వరద ప్రవహిస్తోంది.
రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులు వెళ్లి కాలనీలో పరిస్థితిని పరిశీలించారు. చెరువు నిండటం వల్లే కాలనీల్లోకి మోకాళ్ల లోతు నీరు వచ్చిందని తెలిపారు. ఎక్కడా నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఎనకచెరువు నీటిమట్టం తగ్గితే కాలనీలో కూడా నీళ్లు తగ్గిపోతాయని అధికారులు తెలిపారు. ఎక్కడ ఎటువంటి ప్రమాద ఘటనలు జరగలేదని అన్నారు. నీటిని పంపింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని పటాన్ చెరు తహశీల్దార్ రంగారావు తెలిపారు.