మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చీపురు పట్టిన కిషన్ రెడ్డి - KISHAN REDDY TRIBUTES GANDHIJI - KISHAN REDDY TRIBUTES GANDHIJI
Published : Oct 2, 2024, 2:51 PM IST
Kishan Reddy Tributes Gandhiji: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్టోబర్ 02న 2014న జాతిపిత జయంతిని పురస్కరించుకుని గత పదేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. స్వచ్ఛభారత్‌కు పదేళ్ల సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ కలాసిగూడ పరిసర ప్రాంతాల్లో వీధులను ఊడ్చి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మహాత్మా గాంధీ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసే సందర్భాలలోనూ పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత విషయంలోనూ ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. జాతిపిత గాంధీ ఆలోచనలను ప్రధాని మోదీ ముందుకు తీసుకెళ్లారని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనందరి ఆరోగ్యాలు బాగుంటాయని తెలిపారు.