'నేషనల్ అవార్డు రావడం మాకు బలాన్ని ఇచ్చింది - 'కార్తికేయ 3' కూడా భారీగా నిర్మిస్తాం' - Karthikeya 2 National Award - KARTHIKEYA 2 NATIONAL AWARD
Published : Aug 16, 2024, 4:11 PM IST
Karthikeya 2 National Award : 'కార్తీకేయ 2' చిత్రానికి తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం ప్రేక్షకులు ఇచ్చిన వరంగానూ, కృష్ణుడి ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ , టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. దేశవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం 'కార్తికేయ 2' కు చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇప్పుడీ జాతీయ పురస్కారం రావడం వల్ల తమ ఇరు సంస్థలకు ఎంతో బలాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఉత్సాహంతో 'కార్తికేయ 3' కూడా భారీగా నిర్మిస్తామని అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. విడుదలైన 50 రోజుల్లో తెలుగులో 'కార్తికేయ 2' రూ.120 కోట్ల వసూళ్లు సాధించగా దక్షిణాదిలోనూ నిర్మాతలకు కనకవర్షం కురిపించింది.
కృష్ణతత్వాన్ని జోడిస్తూ సస్పెన్స్ థ్రిల్లర్గా డైరెక్టర్ చందు మొండేటి 'కార్తికేయ 2'ను తెరకెక్కించారు. నిఖిల్ , అనుపమ జంటగా నటించగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు.