తెలంగాణ

telangana

ETV Bharat / videos

దేశంలో టీ20 వరల్డ్​కప్​ ఫైనల్​ ఫీవర్- భారత్​ గెలవాలని ప్రత్యేక పూజలు, హోమాలు​ - T20 World Cup 2024 Final - T20 WORLD CUP 2024 FINAL

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 11:34 AM IST

ICC T20 World Cup 2024 Final Match : దేశవ్యాప్తంగా టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్​ ఫీవర్​ పీక్స్​కు చేరింది. బార్బడోస్​లోని బ్రిడ్జ్​టౌన్​ వేదికగా శనివారం జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికాతో భారత్​ తలపడనున్న నేపథ్యంలో, టీమ్ఇండియా గెలవాలని క్రికెట్ లవర్స్ పూజలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని త్రివేణి సంగమం ప్రాంతంలో క్రికెట్​ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్​ గెలవాలని హారతి ఇచ్చారు. త్రివర్ణ పతాకం, టీమ్ఇండియా ప్రేయర్ల ఫొటోలు ప్రదర్శిస్తూ మేళతాళాలతో భజన చేశారు. ఇండియా గెలవాలని వారణాసిలో క్రికెట్ ఫ్యాన్స్​ భారత్ క్రిటెక్​ ఆటగాళ్ల ఫొటోలతో హోమం నిర్వహించారు. అటు ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రికెట్ లవర్స్​. మరోవైపు కర్ణాటక హుబ్బళ్లిలో ఇండియా గెలవాలంటూ చిన్నారుల నినాదాలు చేశారు. ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మపై ఓ కళాకారుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. 8 అడుగుల రోహిత్​ చిత్రాన్ని గీసి స్పెషల్​ గ్రీటింగ్స్​ తెలిపాడు యూపీ అమ్​రోహకు చెందిన జుహైద్ ఖాన్​ అనే కళాకారుడు.

ABOUT THE AUTHOR

...view details