గోల్డ్ చైన్ చోరీ కేసులో కుమారుడి అరెస్ట్ - మీ అంతు చూస్తానంటూ ఠాణాలో హోంగార్డు హల్‌చల్ - Home Guard Kishan Halchal - HOME GUARD KISHAN HALCHAL
Published : Jul 15, 2024, 1:34 PM IST
Home Guard Halchal in Ghatkesar Police Station : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఠాణాలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న అజ్మిరా కిషన్ అనే హోం గార్డు హల్‌చల్ చేశాడు. బంగారు గొలుసు దొంగతనం కేసులో ఘట్కేసర్ పోలీసులు హోంగార్డు కుమారుడు వెంకటేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న హోంగార్డు, పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
తన కుమారుడినే రిమాండ్‌కు తరలిస్తారా అంటూ హంగామా చేశాడు. మీ అంతు చూస్తానని హెచ్చరించాడు. కులం పేరిట దూషించారని కేసు పెట్టి సస్పెండ్ చేయిస్తానని పోలీసులను బెదిరించాడు. ఠాణాలో క్రైమ్ సీఐ శ్రీనివాస్ ఛాంబర్లోకి వెళ్లి విధులను అడ్డుకున్నాడు. విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై రాము ఫిర్యాదు మేరకు హోంగార్డు పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.