LIVE : అల్లు అర్జున్‌కు ఊరట, మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు - ప్రత్యక్ష ప్రసారం - HERO ALLU ARJUN INTO CUSTODY LIVE
Published : 6 hours ago
|Updated : 2 hours ago
Hero Allu Arjun Into Custody Live : హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. బన్నీ నివాసం నుంచి ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నెల 4న పుష్ప-2 ది రూల్ సినిమా బెనిఫిట్ షోను చూసేందుకు సంధ్య థియేటర్‌కు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అభిమానులతో పాటు ఆయన కూడా సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు వచ్చారు. దీంతో ఒక్కసారిగా అభిమానుకు ఎగబడ్డారు. వారందరిని చెదరగొట్టే తరుణంలో తొక్కిసలాట జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ ఘటనలో ఆమె కుమారుడికి సైతం తీవ్రగాయలయ్యాయి. ఆ బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌పై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన బుధవారం తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Last Updated : 2 hours ago