మరోసారి మెదక్లో భారీ వర్షం - వరద దాటికి కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు - Heavy Rains in Medak District - HEAVY RAINS IN MEDAK DISTRICT
Published : Aug 18, 2024, 9:58 PM IST
Heavy Rains in Medak District : ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో ఇవాళ గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ప్రజలు రోడ్లపై వాహనాలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురవడంతో ఎంజీ రోడ్డులో పాత గాంధీ లైబ్రరీ వద్ద ప్రధాన రహదారి పూర్తిగా జలమయం అయ్యింది.
వరద ధాటికి ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. ఆటోనగర్ నుంచి వెంకట్రావ్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో రాకపోకలకు ఆటంకం కలిగింది. డ్రైనేజీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఆయా చోట్ల వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక రోడ్లు జలమయమయ్యాయి. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ తెలిపారు.