తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణభవన్​లో హరీశ్​రావు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Harishrao live - HARISHRAO LIVE

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 2:04 PM IST

Updated : Mar 25, 2024, 2:41 PM IST

HarishRao Live : హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. హామీలను పూర్తి చేస్తేనే కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు ఉంటుందని వివరించారు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీల విషయంలో ఆ పార్టీ మాట తప్పిందని, వరికి బోనస్ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. నెలకు రూ. 2500 ఇస్తామని, మహిళలను మహాలక్ష్ములను చేస్తామని మాట తప్పినందుకు మహిళలు నిర్ణయం తీసుకోవాలని, నిరుద్యోగ భృతి విషయంలో మోసం చేసినందుకు నిరుద్యోగులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హరీశ్‌రావు కోరారు. అప్పుల విషయంలో తమపై బురద జల్లి మూడు నెలల్లో రూ. 16,000ల కోట్ల అప్పులు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అదనపు అప్పుల కోసం మళ్లీ ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. తమ ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోంటే, భారతీయ జనతా పార్టీ, బీఆర్​ఎస్ ​మధ్య అవగాహన ఉందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కవిత అరెస్ట్ అక్రమమని అన్నారు. తాజాగా తెలంగాణభవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేసశంలో హరీశ్​రావు పాల్గొన్నారు.
Last Updated : Mar 25, 2024, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details