'హనుమాన్' విరాళం అయోధ్యకే కాదు భద్రాచలానికి కూడా! - రామ్ మందిర్ డొనేషన్స్
Published : Jan 27, 2024, 8:00 PM IST
Hanuman Movie Donation : అయోధ్య రామ మందిరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలకు తమవంతు ఆర్థిక సహకారాన్ని అందించనున్నట్లు హనుమాన్ చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇటీవలే 'హనుమాన్' చిత్రం ద్వారా వచ్చే ఆదాయంలో ప్రతి టికెట్ పై 5 రూపాయల చొప్పున విరాళంగా ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అయోధ్య రామ మందిరానికి రూ. 5 కోట్ల రూపాయలను విరాళంగా అందజేసినట్లు తాజాగా ఓ ట్వీట్ ద్వారా తెలియజేసింది. అయితే అయోధ్య తోపాటు భద్రాచలం రామాలయం, చిన్న చిన్న ఆలయాలకు కూడా విరాళం ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మతాజాగా ప్రకటించారు.
మరోవైపు 'హనుమాన్' చిత్రం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయాల పునరుద్దరణ, సినిమాల నిర్మాణాలకు మాత్రమే ఖర్చుపెట్టనున్నట్లు వెల్లడించారు. తమ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు పరోక్షంగా దేవాలయాలకు విరాళంగా ఇస్తున్నారంటూ తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 'హనుమాన్' చిత్రం సుమారు 250 కోట్లకుపైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.